: సచిన్ సరసన చేరిన విరాట్ కోహ్లీ


టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ఛేజింగ్ లో తన సూపర్ సెంచరీలతో 14 సార్లు భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆ రికార్డును సమం చేశాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో కోహ్లీ 154 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 26 సెంచరీలు పూర్తి చేశాడు. ఇక రికార్డ్ విషయానికొస్తే... ఛేజింగ్ లో కోహ్లీ 16 సెంచరీలు చేయగా, ఇండియా 14 సార్లు గెలిచింది. ఛేజింగ్ లో సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలు చేయగా, ఇండియా 14 సార్లు జయకేతనం ఎగురవేసింది. మరో సెంచరీ బాది, ఇండియాను గెలిపిస్తే... సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. ఛేజింగ్ లో ఇప్పటి వరకు 58 ఇన్నింగ్స్ లో కోహ్లీ 3514 పరుగులు చేశాడు. వీటిలో 14 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News