: టెస్టుల్లో అరంగేట్రం చేసి 17 ఏళ్లు అయింది... ఇప్పుడు కెప్టెన్సీ దక్కింది


టెస్టుల్లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల తర్వాత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం అతడికి దక్కింది. సుడులు తిరిగే బంతులతో, తన జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ సీనియర్ క్రికెటర్ కు 38 ఏళ్ల వయసులో కెప్టెన్సీ భాద్యతలు నిర్వహించే ఛాన్స్ లభించింది. అతను ఎవరో కాదు, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు అతను కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ జట్టుకు దూరం కావడం, వైస్ కెప్టెన్ దినేశ్ చండిమాల్ అందుబాటులో లేకపోవడంతో... రంగనా హెరాత్ కు అవకాశం దక్కింది. దీంతో, లేటు వయసులో లేటెస్ట్ కెప్టెన్ గా రంగనా హెరాత్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మరోవిషయం ఏమిటంటే, శ్రీలంక జట్టుకు సోమచంద్ర డిసిల్వా తర్వాత కెప్టెన్ గా ఎంపికైన బౌలర్ హెరాత్ ఒక్కడే. 1991లో టెస్టుల్లో హెరాత్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News