: పోలీస్ కస్టడీలో కబడ్డీ ఆటగాడు రోహిత్
ప్రొ కబడ్డీలో మంచి ప్రతిభ కనబరిచి, అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భార్య ఆత్మహత్య కేసులో అరెస్టైన ఆయనను ఢిల్లీ కోర్టు డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు నిన్న పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా, అక్టోబర్ 25 వరకు రోహిత్ ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని పోలీసులు కోరారు. దీంతో, అతడిని పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అప్పగించారు. ఇదే కేసులో రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అక్టోబర్ 17న నార్త్ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో దుపట్టాతో ఉరివేసుకుని రోహిత్ భార్య లలిత బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులను భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఒక నోట్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలోనే, రోహిత్, అతని తండ్రిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.