: ఆమె వయసు 36.. బరువు 500 కేజీలు.. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళగా రికార్డు


ఈజిప్టుకు చెందిన ఆ మహిళ పేరు ఇమాన్ అహ్మద్ అబ్దులాతి. వయసు 36. ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. 500 కేజీల బరువుతో బాధపడుతున్న ఆమె మంచం మీది నుంచి కాలు కదిపేందుకు కూడా కష్టపడాల్సి వస్తోంది. ఇమాన్ గత 25 ఏళ్లుగా గడప దాటి బయటకు రాలేదంటే ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మంచం మీద అటు ఇటూ కదలడానికి కూడా ఆమె శరీరం సహకరించడం లేదు. ఇక రోజువారీ కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు సాయం అందించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఇమాన్ తెలిపింది. ఎలిఫెంటయాసిస్ అనే వ్యాధే తన బరువుకు కారణమని పేర్కొన్న ఆమె అధిక బరువుతో స్కూలుకు కూడా వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News