: శివపాల్ తో సమావేశమైన ఉద్వాసనకు గురైన మంత్రులు


మంత్రి పదవుల ఉద్వాసన నిర్ణయం పార్టీని బలహీన పరచటమేనని, పార్టీలో కొంతమంది నాయకులు కోటరీగా ఏర్పడ్డారని, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే కొంతమంది సీనియర్ నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత శివపాల్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి శివపాల్ యాదవ్ సహా నలుగురు మంత్రులను తన మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు సీఎం అఖిలేష్ యాదవ్ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్వాసనకు గురైన మంత్రులు ఓపీ సింగ్, షదాబ్ ఫాతిమా, నారద్ రాయ్ లతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శివపాల్ మాట్లాడుతూ, అఖిలేష్ తీసుకున్న నిర్ణయంపై నిరాశతో ఉన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, ములాయం సింగ్ నాయకత్వంలో ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News