: విభేదాలు తారస్థాయికి... బాబాయ్ శివపాల్ పై వేటు... మంత్రివర్గం నుంచి తొలగించిన అఖిలేష్


ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ లుకలుకలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఉదయం తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన సీఎం అఖిలేష్ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. తన బాబాయ్, తండ్రి ములాయంకు ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్ సహా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. తొలగించబడ్డ మంత్రుల్లో సీనియర్ నేత ఓపీ సింగ్ కూడా ఉన్నారు. ఇదిలావుండగా, సీఎంగా అఖిలేష్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి వుంటానని పార్టీ జనరల్ సెక్రటరీ, ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News