: 'మొటిమలు రావడం మన మంచికే' అంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు
యవ్వనంలో ఉన్న వేళ యువతీ, యువకులకు మొటిమలు వస్తే, అది భవిష్యత్తులో మేలు చేస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ సరికొత్త అధ్యయనంలో తేల్చారు. యుక్త వయసులో మొటిమలు రావడాన్ని అదృష్టంగా భావించాలని సలహా ఇస్తున్నారు. మొటిమలు వచ్చిన వారికి వయసు పెరగడం వల్ల కలిగే చర్మపు సహజ మార్పులు ఆలస్యంగా వస్తాయని లండన్ లోని కింగ్స్ కాలేజీ జెనెటిక్ ఎపిడమాలజీ విభాగం ప్రొఫెసర్లు పేర్కొన్నారు. వీరి చర్మం ఆలస్యంగా ముడతలు పడుతుందని, దీనివల్ల మరింతకాలం పాటు యవ్వనంగా కనిపిస్తారని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ సిమోన్ రిబెరో వ్యాఖ్యానించారు. ఈ పరిశోధన గురించిన పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ముద్రితమయ్యాయి.