: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!
ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియాలో వచ్చిన కథనాలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దీనిపై వివరణ ఇస్తూ, కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.