: నేడు బిగ్ ఫైట్... మలేషియాలో ఢీకొట్టుకోబోతున్న భారత్, పాక్


భారత్, పాకిస్థాన్ ల నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. మలేషియాలో జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు రెండు దేశాల మధ్యా జరగనున్న పోరు ఆసక్తికరంగా మారింది. నేటి సాయంత్రం 4 గంటలకు ఇండియా, పాకిస్థాన్ దేశాల నడుమ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ అమ్ముడైపోయినట్టు నిర్వాహకులు ప్రకటించారు. సౌత్ కొరియాతో జరిగిన భారత్ పోరు 1-1తో డ్రా కాగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయంతో తదుపరి రౌండుకు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.

  • Loading...

More Telugu News