: ఒవైసీ సోదరులపై విచారణ వాయిదా
మెదక్ జిల్లా కలెక్టర్ ను దూషించిన ఘటనలో కేసు ఎదుర్కొంటున్న సోదరులు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ,
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలపై విచారణను సంగారెడ్డి కోర్టు వచ్చే సోమవారానికి
వాయిదా వేసింది. కేసుకు సంబంధించి రికార్డులు సరిగా లేనందున కేసు విచారణను
వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.