: రణ్ బీర్ కపూర్ తో ఆన్ స్క్రీన్ రోమాన్స్ కళాత్మకంగా ఉంటుంది: ఐశ్వర్యారాయ్
'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో పరిధిదాటి నటించలేదని ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తెలిపింది. 'ఏ దిల్ హై ముష్కిల్'లో రణ్ బీర్ కపూర్ తో తాను నటించిన రొమాన్స్ సన్నివేశాలపై ఆమె వివరణ ఇస్తూ... దర్శకుడి సలహా మేరకు ఈ సినిమాలో హుందాగా నటించానని తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని చెప్పింది. రణ్ బీర్ కపూర్ తో తాను నటించిన దృశ్యాలు అసభ్యకరంగా ఉండవని, కళాత్మకంగా ఉంటాయని వెల్లడించింది. కాగా, ఈ సినిమాలో పోస్టర్లు, ట్రైలర్ లో ఐష్ హాట్ హాట్ గా కనిపించడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆమె వ్యవహార శైలి, అభిషేక్ తో బంధంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూమర్లు, వార్తలపై దర్శకుడు కరణ్ జొహర్ వివరణ ఇస్తూ...ఈ సినిమాలో ఐశ్వర్య తన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అద్భుతంగా నటించిందన్నాడు. ఈ సినిమాలో స్కిన్ షో లేదా లిప్ లాక్ సన్నివేశాలు లేవని స్పష్టం చేశాడు.