: సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేసిన శ్రీశాంత్


భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కొత్త అవతారంలో అదరగొడుతున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో వారెవ్వా అనిపిస్తున్నాడు. రోజుకు నాలుగు గంటల చొప్పున నాలుగు నెలల పాటు కష్టపడి బాడీని డెవలప్ చేశాడు. దీనికోసం, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు శ్రీ. తన లేటెస్ట్ బాడీ ఫొటోను ట్విట్టర్ లో కూడా అప్ లోడ్ చేశాడు. అంతేకాదు, ఎవరైనా కఠినంగా శ్రమిస్తే, శరీరాన్ని తనలా మలుచుకోవచ్చని ట్యాగ్ పెట్టాడు. 'టీమ్ 5' అనే సినిమాలో శ్రీశాంత్ నటిస్తున్నాడు. అతని మాతృ భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసమే శ్రీశాంత్ బాడీ బిల్డప్ చేశాడు. ఈ సినిమాలో బైక్ తో సాహసాలు చేసే పాత్రలో శ్రీ కనిపించబోతున్నాడు. అంతేకాదు, హిందీలో కూడా 'అక్సర్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని సరసన జరైన్ ఖాన్ నటిస్తోంది. శ్రీశాంత్ మంచి డ్యాన్సర్, సింగర్ అనే విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News