: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక జారీ
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం పోర్టుబ్లెయిర్‌కు వాయవ్య దిశగా 350కి.మీ. దూరంలో ఉందని పేర్కొన్నారు. రాగల 48 గంటల్లో బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. మరో 24 గంటల్లో మయన్మార్ తీరానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. దీంతో పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.