: కృష్ణా నదీ నీటి పంపకాల తీర్పుపై కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
కృష్ణా నదీ నీటి పంపకాలపై ఇటీవలే బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నిన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో హైదరాబాద్‌లో ఈ ఉపసంఘం భేటీ కానుంది. కృష్ణా నదీ నీటి పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం నాలుగు వారాల్లో ఏమయినా అభ్యంతరాలు ఉంటే ట్రైబ్యునల్‌కు చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఈ అంశంపై సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకొని, నివేదిక రూపొందించి ట్రైబ్యునల్‌కు అందించనుంది.