: కామెరూన్ లో పట్టాలు తప్పిన రైలు.. 53 మంది మృతి.. మరో 300 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు
రైలు పట్టాలు తప్పడంతో 53 మంది మృతి చెందిన పెను ప్రమాద ఘటన ఆఫ్రికాలోని కామెరూన్ దేశంలో జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ దేశ రాజధాని యాండీ, దౌలా నగరాల మధ్య వంతెన కూలిపోయింది. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులంతా రైలు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం నిన్న ఉదయం 11 గంటలకు యాండీ నుంచి దౌలా బయలుదేరిన ట్రైను ఎసెకా నగర సమీపానికి రాగానే పట్టాలు తప్పింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో 300 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.