: అభిమాని గ్రీటింగ్స్ కు సరదాగా రిప్లై ఇచ్చిన సెహ్వాగ్


టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ మధ్య కాలంలో ట్విట్టర్లో చెలరేగిపోతున్నాడు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ, అభిమానులను అలరిస్తున్నాడు. 20వ తేదీన వీరూ 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా #AskSehwag అనే ట్యాగ్ పెట్టి, తనని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చని పోస్ట్ చేశాడు. చెప్పినట్టుగానే, పలువురి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు కూడా. అయితే, దేవరాజన్ అనే ఓ వ్యక్తి మాత్రం సెహ్వాగ్ పుట్టిన రోజు అయిపోయిన రెండు రోజులకు 'హ్యాపీ బర్త్ డే వీరూ' అని పోస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా, "ఇంకా 363 రోజులు ఉంది బాబూ. చాలా తొందరగా గ్రీటింగ్స్ చెప్పావు. అయినా ఓకే. థాంక్యూ" అంటూ సరదాగా రీప్లై ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ తన అభిమానులకు ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్న వీరూని అభినందించాల్సిందే. మరో విషయం ఏమిటంటే... ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం నాడు జరగనున్న మూడో వన్డేలో సెహ్వాగ్ కామెంటేటర్ గా దర్శనమివ్వబోతున్నాడు.

  • Loading...

More Telugu News