: కారులో రూ.2.5 కోట్ల నగదు.. కర్ణాటక విధాన సభలో ఆవరణలో స్వాధీనం చేసుకున్న పోలీసులు


కర్ణాటక విధాన సభ ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన కారులోంచి పోలీసులు ఏకంగా రూ.2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కెంగెల్ హనుమంతయ్య గేట్ నుంచి విధాన సౌధలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వోక్స్ వ్యాగన్ కారును పోలీసులు తనిఖీ చేశారు. అందులో మూడు అట్టపెట్టెల్లో ఉన్న రూ.2.5 కోట్ల నగదు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో కారు యజమాని అయిన ధార్వాడకు చెందిన లాయర్, మాజీ జడ్జి కుమారుడు సిద్ధార్థ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓ టెండర్ కోసం ఈ డబ్బులను మంత్రికి ఇచ్చేందుకు తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ్‌ను విచారిస్తున్నామని, నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేవని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. నగదు విషయంలో సిద్ధార్థ్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని డీసీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News