: హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. ముట్టడించిన టీఎస్ఎస్ఎఫ్ నేతలు


హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఎస్ఎఫ్ నేతలు మంత్రుల క్వార్టర్స్‌ను ముట్టడించారు. భారీగా చేరుకున్న నేతలు క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రక్తత ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న టీఎస్ఎస్ఎఫ్ నేతలను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News