: కార్డన్ సెర్చ్‌లో బయటపడిన కల్తీపాల వ్యాపారం.. పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో కల్తీ పాల వ్యవహారం బయటపడింది. కామాటిపురాలోని డెయిరీ ఫామ్‌లో కల్తీపాలు తయారుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మిల్క్హౌస్ పేరిట నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్‌లో కల్తీపాలను యథేచ్ఛగా తయారుచేస్తుండడాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. పాలపొడి, రసాయనాలతో కల్తీపాలు తయారుచేస్తున్న అలీవారిస్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాగోతం ఎన్నాళ్ల నుంచి నడుస్తోందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.