: హైదరాబాదులోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు ఇచ్చేయండి: చంద్రబాబు ఆదేశం


హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిలో భాగంగా ఏపీ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు బాధ్యతలను కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారు. సచివాలయంలో ఏపీ భవనాలు, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి భవనాలను అప్పగించాలని ఆయన సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చేలా ఓ భవంతిని అడిగి తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. అంతకన్నా ముందుగానే, మిగిలివున్న కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం భవనాలను స్వాధీనం చేసుకోవాలని కూడా సుజనా చౌదరిని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం మంత్రులు, అధికారులతో సమావేశమైన చంద్రబాబు, పాలనంతా అమరావతి కేంద్రంగా సాగుతుండటం, కొత్త భవంతులు కట్టుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇక సచివాలయంలోని కొన్ని బ్లాక్ లను ఉంచుకొని విమర్శల పాలవడం మంచిది కాదని కొంత మంది మంత్రులు చేసిన సూచనలపై చర్చించిన బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News