: పాకిస్థానీ కళాకారులను మాత్రమే ఎందుకు శిక్షించాలి?: దిగ్విజయ్ సింగ్
యూరీ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ కళాకారులపై భారత్‌లో నిషేధం విధించాలని వస్తోన్న డిమాండ్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించారు. బాలీవుడ్‌లో కరణ్‌జొహార్ తెరకెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలపై ప్రస్తుతం వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నిర్మాతల విషయంలో తాను బాలీవుడ్ వైఖరికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ నుంచి వచ్చే కళాకారులను మాత్రమే ఎందుకు శిక్షించాలని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ఉన్న ఇతర సంబంధాలను ఎందుకు నిషేధించకూడదు? అని అడిగారు. పాకిస్థాన్‌తో భారత్ చర్చలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇరు దేశాల కళాకారులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించారు. కళాకారులే ఇరు దేశాల వైపులా రాయబారులుగా ఉండగలరని ఆయన చెప్పారు.