: పాక్ ను తీవ్రంగా హెచ్చరించిన జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా


ఇండియాతో శాంతి కోరుకునేట్లయితే, వెంటనే ఉగ్రవాదులకు సహకారాన్ని ఆపాల్సిందేనని పాకిస్థాన్ కు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. ఓ వైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, మరో వైపు చర్చలంటే అవి సాధ్యం కాదని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం శాశ్వతం కాబోదని, రాష్ట్రంలో పరిస్థితి మెరుగపడిన వెంటనే తొలగిస్తామని తెలిపారు. రాళ్లు రువ్వి విధ్వంసాలకు దిగాలని ప్రబోధించే వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని కోరిన మెహబూబా, ఉగ్ర శిబిరాలను పాక్ వెంటనే మూసివేయాలని, అప్పుడే చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News