: తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ఇంటెక్స్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్
స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైంది. తక్కువ ధరకే మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోన్న సదరు సంస్థ ‘ఇంటెక్స్ క్లౌడ్ స్కాన్ ఎఫ్‌పి’ పేరుతో మరో మోడల్ ఫోన్‌ను రూ.3,999 ధరతో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. అధునాతన ఫీచర్లన్నీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లు పేర్కొంది. అంతేగాక, ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ స్నాప్‌డీల్‌లో క్లౌడ్ స్కాన్ ఎఫ్‌పిను వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. 2450 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రెంట్, బ్యాక్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమొరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.