: ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో భార్యను ముద్దాడిన అమీర్ ఖాన్
ముంబైలో ‘జియో’ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో తన భార్య కిరణ్ రావును బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముద్దాడాడు. పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలకు చాలా దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఈ విధంగా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న ప్రారంభమైన ‘జియో’ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి సైడ్ క్రాఫ్, గుబురు గడ్డం, చెవికిపోగుతో, కళ్ల జోడు ధరించి వచ్చిన అమీర్ ఖాన్ బ్లాక్ సూట్ లో మెరిసిపోయాడు. కాగా, అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘దంగల్’ ట్రైలర్ నిన్న విడుదల అయింది. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా, ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా వివాదంపై మాట్లాడేందుకు అమీర్ ఖాన్ నిరాకరించాడు.