: ట్రంప్ నోటివెంట రాకూడని మాటలు వచ్చిన వేళ... పెద్ద బుష్ స్వయంగా బిల్ క్లింటన్ కు 1993లో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్


ఎన్నికల్లో తాను గెలిస్తేనే ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్టని, హిల్లరీ గెలిస్తే తాను ఆమె విజయాన్ని అంగీకరించేది లేదని గతంలో అధ్యక్ష పదవికి పోటీ పడిన ఎవరూ చేయనటువంటి సంచలన వ్యాఖ్యలను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వేళ, 1993లో తన అధికారాన్ని బిల్ క్లింటన్ కు అప్పగిస్తూ, జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ స్వయంగా రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1993లోనూ రిపబ్లికన్ల నుంచి అధికారం డెమోక్రాట్ల చేతుల్లోకి వచ్చింది. నాడు బుష్ రాసిన లేఖలో "నీ విజయం ఇప్పుడిక మన దేశపు విజయం అవుతుంది" అని అయన అభివర్ణించారు. బుష్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ఉన్న లేఖ ప్రతి ఇప్పుడు సోషల్ మీడియాలో శరవేగంగా చక్కర్లు కొడుతూ ట్రంప్ పై మరింత అయిష్టతను పెంచుతోంది. తొలుత నేషనల్ పబ్లిక్ రేడియో ఈ లేఖను బయటపెడుతూ, "దీన్ని చదవండి. దీని గురించి ఆలోచించండి. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ నుంచి బిల్ క్లింటన్ కు వచ్చిన లేఖ. ఎంత అందంగా ఉంది" అంటూ వ్యాఖ్యానించింది. మీరూ, మీ కుటుంబం బాగుండాలని నాడు బుష్ కోరుకున్నారు. జనవరి 20, 1993 తేదీతో ఉన్న ఈ లేఖను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News