: రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేవు: చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ తరువాత గవర్నర్ నరసింహన్
విజయవాడలోని ఓ హోటల్‌లో గవర్నర్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ఏమీ లేవని అన్నారు. సంప్రదింపులు, చర్చల ద్వారా ఇరు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకుంటున్నాయని తెలిపారు. ఈ భేటీలో హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.