: రెండు వారాలే గడువు.. లోథా సిఫారసులు అమలు చేయాల్సిందే: సుప్రీంకోర్టు


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. లోథా కమిటీ సూచించిన ప్రతిపాదనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని బీసీసీఐకి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. లోధా కమిటీ ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ ప్రతిపాదనల అమలుకు రెండు వారాల గడువు విధించింది. అంతవరకు బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ క్రమంలో బీసీసీఐ ఆదాయ వ్యయాలను అధ్యయనం చేసేందుకు బీసీసీఐ స్వతంత్ర అడ్వకేట్ ను నియమించుకునేందుకు అంగీకరించింది

  • Loading...

More Telugu News