: లండన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాల్లో బతుకమ్మ పండగ సూపర్: కవిత


అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరిగిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయని అన్నారు. ఒకరోజు లండన్ లో మరొకరోజు కాలిఫోర్నియాలో, ఇంకొకరోజు ఆస్ట్రేలియాలో, ఆ తరువాత సౌదీ అరేబియాలో, చివరిగా కువైట్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయని అన్నారు. ప్రపంచం మొత్తం బతుకమ్మ పండుగను చేసుకుంటోందని ఆమె తెలిపారు. కువైట్ లో అయితే పదివేల మంది భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారని, తనకు వారిని చూసే సరికి చాలా సంతోషమేసిందని కవిత తెలిపారు. బతుకమ్మ పండగకు తెలంగాణ జాగృతి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News