: జమ్మూలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి
జమ్మూలో బస్సు లోయలో పడ్డ సంఘటనలో 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. రియాసి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు జమ్మూకాశ్మీర్ మంత్రి అజయ్ నందా పేర్కొన్నారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.