: భారీ షాట్లతో అలరించి అవుట్ అయిన విలియమ్ సన్, 200 దాటిన న్యూజిలాండ్ స్కోరు
న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్ సన్ సెంచరీ చేసిన ఊపుతో మరింతగా విజృంభించి ఆడుతూ ఓ భారీ షాట్ కు ప్రయత్నించి మిశ్రా బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 40వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటగా, విలియమ్ సన్ 118 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద (128 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో లూక్ రోంచ్ 4 పరుగులతో ఆడుతుండగా, అతనికి శాంట్ నర్ జత కలిశాడు. అంతకుముందు 21 పరుగులు చేసిన ఆండర్ సన్ నాలుగో వికెట్ రూపంలో పెవీలియన్ దారి పట్టాడు. ఈ వికెట్ మిశ్రా ఖాతాలోకి వెళ్లింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు.