: గుంటూరులో దారుణం... కన్న కొడుకునే ముక్కలు ముక్కలుగా చేసి హతమార్చిన మహిళ
కన్న కొడుకునే ఓ తల్లి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో ఈ రోజు ఉదయం వెలుగులోకొచ్చింది. కొడుకుని చంపి అతడి శరీరాన్ని సదరు మహిళ ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లోనే ఉంచింది. అయితే, ఈ రోజు ఉదయం ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో పడి ఉన్న అతడి శరీర భాగాలు చూసి షాక్ తిన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఆస్తి వివాదమే తల్లి కొడుకుని చంపడానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.