: సోషల్ మీడియాలో బాలయ్య ఫోటో వైరల్...బాలయ్య సంస్కారానికి మురిసిపోతున్న అభిమానులు
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో షూటింగ్ జరుగుతున్న 'సర్కార్ 3' షూటింగ్ స్పాట్ కు వెళ్లిన బాలకృష్ణ ఆ షూటింగ్ లో ఉన్న అమితాబ్ బచ్చన్ ను కలిశారు. భారతీయ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజమైన అమితాబ్ ను కలవగానే బాలయ్య తన హోదా, స్థాయిని పక్కనపెట్టి ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్టార్ హోదా తలకెక్కిన ఏ నటుడైనా ఇలా చేయగలడా? మా అభిమాన నటుడి సంస్కారం చూడండంటూ అమితాబ్ కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా అమితాబ్ తో పలు విషయాలపై మాట్లాడిన బాలయ్య, తన తదుపరి సినిమా 'రైతు'లో నటించాలని కోరినట్టు తెలుస్తోంది.