: నవజ్యోత్ సింగ్ సిద్దూకి కాంగ్రెస్ భారీ ఆఫర్
ఆవాజ్ ఏ పంజాబ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపితే, సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని సిద్దూ సన్నిహితులు వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం ఈ ఆఫర్ పై కొంచెం అసంతృప్తితో ఉన్నారట. సిద్దూ పార్టీ పెట్టక ముందు కూడా కాంగ్రెస్ లో చేరాలంటూ ఆయనకు ఆఫర్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఆఫర్ తలుపుతట్టింది. మరోపైపు సిద్దూతో ఆప్ కూడా టచ్ లో ఉందని వార్తలు వస్తుండటంతో, ఆయనకు పంజాబ్ లో క్రేజ్ బాగా పెరిగింది. దీనికితోడు, ఉత్తరప్రదేశ్ తో పోల్చితే పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో... ఆ పార్టీ సిద్దూ మద్దతు కూడా కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది.