: నేడు చంద్రబాబు వైజాగ్ పర్యటన.. బిజీబిజీ!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే...వంగలిలో కేంద్ర పెట్రోలియం యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వైజాగ్ లోని సీతమ్మధారలో 9 ఐటీ సంస్థల ప్రారంభోత్సవంలో పాలుపంచుకోనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని డిజిటల్‌ తరగతి గదులను ఆయన ప్రారంభిస్తారు. చివరగా జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ లతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News