: ట్రాక్టర్ ను ఢీ కొట్టిన గౌతమి ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు


నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా మునగాల ఇంద్రానగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాదు వస్తున్న గౌతమి ట్రావెల్స్ బస్సు 9వ నెంబర్ జాతీయ రహదారిపై మునగాల వద్ద ఒక ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడ్డవారికి సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News