: ఒబామానే మళ్లీ అధ్యక్షుడిగా కావాలంటూ బోరున ఏడుస్తున్న బుడతడు!


అమెరికా ప్రెసిడెంట్ గా రెండు పర్యాయాలు కొనసాగిన బరాక్ ఒబామాయే మళ్లీ అధ్యక్షుడిగా కావాలంటూ నాలుగేళ్ల చిన్నారి బోరున ఏడుస్తున్నాడు. అనిల్ డ్యానిలా మాల్డోనాడో అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడు కిస్టోఫర్ తో జరిపిన సంభాషణ ఆసక్తిదాయకంగా ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తన కుమారుడితో తల్లి మాల్డోనాడో ప్రస్తావించింది. ఒబామా పదవీకాలం ముగియనుండటంతో కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకునే సమయం ఆసన్నమైందని కిస్టోఫర్ తో చెప్పింది. వెంటనే, ఆ చిన్నారి స్పందిస్తూ మళ్లీ ప్రెసిడెంట్ గా ఒబామానే కావాలంటూ ఏడ్చేశాడు. ఒబామా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ప్రెసిడెంట్ కారనే విషయాన్ని తల్లి ఎంతగా చెప్పినప్పటికీ ఆ చిన్నారి వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సంభాషణ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News