: బహు భార్యత్వం ముస్లింల కంటే హిందువుల్లోనే ఎక్కువగా ఉంది: జైపాల్ రెడ్డి


కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బహు భార్యత్వం ముస్లింల కంటే హిందువుల్లోనే ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ మతంలోని మహిళలపై జరుగుతున్న వేధింపులను తొలుత అరికట్టాలని, ఆ తర్వాతే ముస్లిం మహిళా సమస్యలపై మాట్లాడాలంటూ బీజేపీకి సూచించారు. ప్రజలను విభజించేలా బీజేపీ పాలన సాగుతోందని ఆరోపించారు. భారత జవాన్లను ఇజ్రాయెల్ సైనికులతో పోల్చడం ద్వారా మన వాళ్లను మోదీ అవమానించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన నిలబడుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News