: టీ చేయగలగడమే ప్రధాని పదవికి అర్హత అయితే... మోదీ కంటే నేను బాగా చేస్తా: అజాంఖాన్


భారతదేశ ప్రధాని పదవిని చేపట్టేందుకు టీ తయారు చేయగలగడమే అర్హత అయితే... మోదీ కన్నా తాను గొప్పగా టీ చేయగలనని సమాజ్ వాదీ పార్టీ వివాదాస్పద నేత అజాంఖాన్ అన్నారు. తాను వంట కూడా బాగా చేయగలనని ఆయన అన్నారు. సూటు బూటు వేసుకొని చాలా హుందాగా ఉండగలనని చెప్పారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని భారత్ కు తెప్పిస్తానని... ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తానని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. తాను ప్రధాని అయితే ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 20 లక్షలు వేస్తానని ఈయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News