: కదం తొక్కిన మహిళలు.. వైజాగ్, వడ్లపూడిలోని బార్ అండ్ రెస్టారెంట్ ధ్వంసం!
విశాఖపట్టణంలోని వడ్లపూడిలో మహిళలు కదంతొక్కారు. తాగుబోతులు స్థానిక మహిళలపై వేధింపులకు దిగుతుండడంతో పలు మార్లు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను తరలించాలంటూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోవడానికి తోడు, నిర్ణీత సమయానికంటే ఎక్కువ సేపు ఆ బార్ అండ్ రెస్టారెంట్ ను తెరచి వుంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్య వైఖరితో విసుగు చెందిన మహిళలు కదంతొక్కి సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై దాడికి దిగారు. బార్ లోనికి చొచ్చుకెళ్లిన మహిళలు మద్యం బాటిళ్లను పగులగొట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రావడంతో... అన్యాయానికి వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.