: రోడ్డు ప్రమాదంలో మమతా బెనర్జీ మేనల్లుడికి గాయాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈరోజు ముర్షీదాబాద్ నుంచి కోల్ కతాకు అభిషేక్ కారులో వస్తుండగా, దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే పై సింగూర్ సమీపంలో ఆయన కారును, ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆయన్ని కోల్ కతాలోని బెల్లే నర్సింగ్ హోమ్ కు తరలించారు. అభిషేక్ తలకు, భుజానికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న మమతా బెనర్జీ తన మేనల్లుడిని పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు.