: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలని కర్ణాటకకు సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు


క‌ర్ణాట‌క-త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న కావేరీ న‌దీ జ‌లాల వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు మ‌రోసారి విచార‌ణ జ‌రిపింది. వాద‌న‌లు విన్న అనంత‌రం రేపు ఇదే అంశంపై మ‌రోసారి విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించింది. మరోవైపు ఈ రోజు త‌మిళ‌నాడులో కేంద్రం, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News