: కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే పువ్వాడ


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని టీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలిపారు. పువ్వాడ ఆక్రమించుకున్న సరస్సులోని భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని ఆరోపిస్తూ సుధాకర్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాలను తక్షణమే ఆపేయాలని పువ్వాడకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే, కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. రూ. 2.10 కోట్లు చెల్లించి జీవో 59 ప్రకారం కాలేజీ పక్కనున్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నామని తెలిపారు. తమ కాలేజీ ఆవరణలో ఎలాంటి సరస్సులు లేవని చెప్పారు.

  • Loading...

More Telugu News