: నా మీద అలిగి, నా కూతురు నాతో ఏడాదిన్నరపాటు మాట్లాడలేదు: అజయ్ దేవగణ్
బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ 'శివాయ్' సినిమా సందడి మొదలైంది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్ లో పాల్గొన్న అజయ్ ముంబైలో మాట్లాడుతూ, 'శివాయ్' షూటింగ్ లో తాను చాలా బిజీగా ఉండేవాడినని, దీంతో కోపం వచ్చిన తన కుమార్తె నైసా, తనపై అలిగి ఏడాదన్నర పాటు తనతో మాట్లాడలేదని అన్నాడు. అయితే, ఈ సినిమా ట్రైలర్, పాటలు చూశాక మీ కుమార్తెగా పుట్టడం గర్వంగా ఉంది అని చెప్పిందని అన్నాడు. ఆ కాంప్లిమెంట్ తనకు చాలా పెద్దదని అజయ్ తెలిపాడు. ఇంత చిన్న వయసులో అంతపరిణతి కనబర్చడం చాలా గొప్ప విషయమనిపించిందని పుత్రికోత్సాహం ప్రదర్శించాడు. తండ్రీకుమార్తెల మధ్య భావోద్వేగాలతో అల్లుకున్న కథ కనుక ఈ సినిమా తనకు బాగా కనెక్ట్ అయిందని చెప్పాడు.