: మహారాష్ట్రలోని థానేలో యువకుడిని పాడుబడిన భవనంలోకి తీసుకువెళ్లి చావబాదిన యువకులు
మహారాష్ట్రలోని థానేలో కొంతమంది యువకులు మరో యువకుడిని చావబాదిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఆ ప్రాంతంలో ఓ పాడుబడిన భవనంలోకి ఓ యువకుడిని తీసుకువెళ్లి కర్రలతో దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. తనను కొట్టవద్దని ఆ యువకుడు ఎంతగా వేడుకుంటున్నా, ఏడుస్తున్నా అతడిపై దాడిని కొనసాగించారు. ఈ ఘటన జరుగుతుండగా సదరు దృశ్యాలను మరో యువకుడు సెల్ఫోన్లో బంధించాడు. ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. యువకుడి షర్టు విప్పేసి మరీ యువకుడిని ఒంటరి చేసి గదిలో చితక్కొట్టారు.