: మరికాసేపట్లో ఢిల్లీలో జీఎస్టీ మండలి భేటీ.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) సవరణ బిల్లుపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన జీఎస్టీ మండలి కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బిల్లు అమలులో ముందుకెళ్లాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొననున్నారు. సమావేశంలో ముఖ్యంగా జీఎస్టీ రేటు సహా వివిధ అపరిష్కృత అంశాలపై మండలి చర్చించనుంది. పన్నురేటు, శ్లాబ్ ల విధానంపై నిర్ణయం తీసుకోనుంది.