: పాకిస్తాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అపరిచితులతో నిండి ఉండేది: మాజీ పేసర్ షోయబ్ అక్తర్


1996లో అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ తార స్థాయికి చేరుకుందని, పాకిస్తాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అపరిచితులతో నిండి ఉండేదంటూ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, మ్యాచ్ ఫిక్సింగ్ కు తానెప్పుడూ దూరంగా ఉండేవాడినని చెప్పాడు. అంతేకాకుండా, నిబద్ధతతో క్రికెట్ ఆడాలని, ఫిక్సింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇతర క్రికెటర్లకు సలహా ఇచ్చేవాడినని చెప్పాడు. గతంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురైన పాక్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ను కూడా అప్పట్లో హెచ్చరించానని, ఫిక్సింగ్ ఆటగాళ్లకు దూరంగా ఉండాలని చెప్పానని షోయబ్ అక్తర్ నాటి విషయాలను ప్రస్తావించాడు.

  • Loading...

More Telugu News