: గున్న ఏనుగు బంధానికి సలాం కొడుతున్న నెటిజన్లు!
ఆపదలో ఉన్న మనిషికి మనిషే సాయం చేయకుండా వెళ్లిపోతుండడం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనుషుల కన్నా జంతువులే నయం అనుకుంటుంటాం. ఆ మాటకు అర్థం చెప్పేలా ఓ గున్న ఏనుగు ప్రవర్తించింది. తన శిక్షకుడు నీటిలో ఈత కొడుతుంటే అతడు మునిగిపోతున్నాడేమోనని భావించిన ఓ ఏనుగు గబగబా నీటిలోకి వెళ్లి అతడిని కాపాడాలని చూసింది. చిన్న ఏనుగు చేసిన ఈ పనికి సోషల్‌మీడియాలో నెటిజన్లు సలాం కొడుతున్నారు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్‌లో చోటుచేసుకుంది. తొండంతో, కాళ్లతో తన శిక్షకుడిని పట్టుకున్న ఏనుగు అతడిని రక్షించాలని చూసింది. ఏనుగుకి, దాని శిక్షకుడికి ఉన్న ఈ బంధాన్ని చూస్తోంటే అందరికీ ముచ్చటేస్తోంది.