: బీసీసీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు


బీసీసీఐ ప్రక్షాళన కోసం లోథా కమిటీ చేసిన ప్రతిపాదనలను బీసీసీఐ పెడచెవిన పెట్టిన విషయం తెలిసిందే. కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే పలుసార్లు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ రోజు మ‌రోసారి ఆ బోర్డుపై న్యాయ‌స్థానం మండిప‌డింది. ధిక్కారణ ధోరణితో బీసీసీఐ వ్యవహరిస్తోందని పేర్కొంది. లోథా క‌మిటీ సిఫార్సుల‌ను అమ‌లు ప‌ర్చ‌డానికి త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని బోర్డు తరఫు లాయర్ కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. అయితే, ఈ అంశంపై తీర్పును ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని న్యాయస్థానం తెలపలేదు.

  • Loading...

More Telugu News