: రాజస్థాన్ లో కుప్పకూలిన వేదిక.. మాజీ సీఎంకు స్వల్పగాయాలు


రాజస్థాన్ లోని టోంక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వేదికనై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు. నిన్న జరిగిన ఈ సంఘటనలో గెహ్లాట్ తో పాటు కార్యకర్తలకూ స్వల్ప గాయాలయ్యాయి. గెహ్లాట్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వేదికపైకి చేరుకోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News