: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి
ఆప్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి తాజాగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడికి గాయాలయ్యాయి. దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్ అడ్డా ఏరియాలో పాక్ ఔట్‌పోస్ట్ లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. పాక్ సైనికులు తేరుకొని దాడులను తిప్పికొట్టడానికి ప్రయత్నించారని, దీంతో ఉగ్రవాదులు ఆప్ఘానిస్థాన్ సరిహద్దుల వైపు పారిపోయినట్టు వారు తెలిపారు. ఈ దాడి ఏ ఉగ్రవాద సంస్థ చేసిందో ఇంకా తెలియరాలేదు.